Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో సోనియా గాంధీ
Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి కొవిడ్ సోకింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కొవిడ్ నిర్దారణ కావడంతో ప్రియాంక గాంధీ కూడా టెస్ట్ చేయించుకున్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది.
Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి కొవిడ్ సోకింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కొవిడ్ నిర్దారణ కావడంతో ప్రియాంక గాంధీ కూడా టెస్ట్ చేయించుకున్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని... హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు. తన తల్లి సోనియాకు కొవిడ్ సోకిన మరుసటి రోజే ప్రియాంక గాంధీకి వైరస్ నిర్దారణ అయింది.
నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కొవిడ్ నిర్దారణ అయింది. బుధవారం సోనియాకు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో ఆమెకు కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. కొవిడ్ సోకిందని తేలిన వెంటనే సోనియా గాంధీ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. గత వారం రోజులుగా సోనియా గాంధీ అనేకమంది కాంగ్రెస్ నేతలను కలిశారు. వారిలో కొంతమందికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సోనియా కోలుకుంటారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.ఈనెల 8న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఈడీ ముందు సోనియా గాంధీ హాజరవుతారని తెలిపారు.