Protesting Punjab farmer ends life at Delhi’s Singhu border: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి నిరసనకారుల్లోని ఓ రైతు (farmer) ఉరి వేసుకున్నారు. మృతుడు పంజాబ్‌లోని అమ్రోహ్‌ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (Gurpreet Singh) అని పోలీసులు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై కుండ్లీ పోలీసులు (Police) దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు నెల రోజుల క్రితం కూడా సింఘు సరిహద్దు (Singh border) వద్ద ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలో లాఖ్‌బీర్ సింగ్ అనే రోజూకూలీ హత్యకు గురయ్యారు. మృతుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఏ నేర చరిత్ర కూడా లేదని ఆ టైమ్‌లో పోలీసులు పేర్కొన్నారు. 


Also Read : Woman Kills Husband : ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య


గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ (Delhi) సరిహద్దు ప్రాంతాలైన సింఘు (Singhu border), టిక్రీలో ఈ ఆందోళన కొనసాగుతోంది. నవంబర్ 26తో ఈ నిరసనలకు ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో అక్కడ నిరసన చేపడుతున్న వారంతా కూడా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Also Read :  AP-Odisha Border Issue: ఆ పదహారు గ్రామాల పయనం ఎటు, ఏపీలోనా లేదా ఒడిశాలోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook