చెన్నై: దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తూ.. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా కరోనా భూతం ప్రబలుతున్న తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట చేరవద్దంటూ ఇప్పటికే ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం 2019 కు వ్యతిరేకంగా ఆందోళన కారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: నా బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దు...


CHENNAI పుర వీధుల్లో సుమారుగా 5వేల మంది పురసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా CAAను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చేపాక్ ప్రాంతంలో భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన పాల్గొన్నవారంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారని, చెన్నై నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు చేపట్టిన నిరసనకారుల పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతునప్పటికీ విరమిచడం లేదన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆందోళనలకు, నిరసనలకు సరైన సమయం కాదని మండిపడుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.


Also Read: మేం జోక్యం చేసుకోలేం.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్ట్..