తమిళనాడులోని ఓ ప్రాచీన దేవాలయంలో లంకె బిందె బయటపడింది. ఆలయంలో తవ్వకాలు జరుపుతున్న సిబ్బందికి బంగారంతో కూడిన కుండ లభించింది. దీంతో ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నిధి నిక్షేపాలు ఉండి వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు జంబుకేశ్వరార్ అఖిలాండశ్వరి ఆలయం. ఇక్కడ ఆలయ పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది.. తవ్వకాలు చేపట్టారు. ఆ సమయంలో వారికి 505 బంగారు నాణేలు. . ఓ కుండలో పెట్టి కనిపించాయి. వాటిని సిబ్బంది బయటకు తీశారు. మొత్తం 505 బంగారు నాణేల్లో 504 చిన్నవిగా ఉండగా. . మరొకటి పెద్దగా ఉంది. వాటి బరువు ఒక కిలో 716 గ్రాములుగా ఉంది. వాటి విలువ ప్రస్తుతం 68 లక్షల రూపాయలని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.
అన్ని బంగారు నాణేలపై అరబిక్ భాషలో రాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఆ నాణేలపై ఏం రాశారనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నాణేలను పురావస్తు శాఖకు ఇచ్చేందు కోసం పోలీసులకు స్వాధీనం చేశారు.
ఆలయ తవ్వకాల్లో దొరికిన నాణేలు. . క్రీస్తు పూర్వం 1000 నుంచి 1200 శకానికి చెందినట్లుగా తెలుస్తోంది. ఆలయంలోని అమ్మన్ సన్నతి ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణేలు లభించాయి. ఏడు అడుగుల మేర తవ్విన తర్వాత బంగారు నాణేలు ఉన్న బిందె దొరికిందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఈ ఆలయ ప్రాంతంలో మరిన్ని లంకె బిందెలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై పురావస్తు శాఖ ఓ నిర్ణయం తీసుకుని తవ్వకాలు జరిపే అవకాశం ఉంది.
లంకె బిందెలో బంగారు నాణేలు..!!