PSLV C 51 Launch: అంతరిక్షంలో విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్, తొలిసారిగా భగవద్గీత, మోదీ ఫోటో
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా పేరుతో పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగమిది.
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా పేరుతో పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగమిది.
శ్రీహరికోట( Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ( SHAR ) వేదిక నుంచి ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం అంటే ఫిబ్రవరి 27 వ తేదీ ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి..ఇవాళ ఉదయం 10 గంటల 24 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ 51 ( PSLV C 51 Rocket) రాకెట్‌ను విజయవంతంగా రోదసిలో ప్రయోగించగలిగింది. ఇస్రో ఆధ్వర్యంలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పేరుతో ప్రయోగించిన తొలి పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగమిది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో( ISRO) ఖ్యాతి మరింతగా పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ( Satish dhawan space centre)నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌తో పాటు బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ( Amazonia-01) ఉపగ్రహం, అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్‌శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపించారు. ఇందులో ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించారు.
Also read: Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లో..ధర ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook