Public Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవే
Public Holidays 2025: మరి కొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో తెలుసుకుందాం.
Public Holidays 2025: మరో వారం రోజుల్లో 2024 ముగియనుంది. కొత్త ఏడాది 2025 ప్రారంభం కానుంంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు సైతం సెలవుల జాబితా విడుదల చేస్తుంటాయి. వచ్చే ఏడాది 2025లో సెలవులెప్పుడున్నాయో చెక్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సెలవుల జాబితా విడుదల చేసింది.
సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. జాతీయ సెలవులు కాకుండా ప్రాంతీయ సెలవులుంటాయి. యూపీ ప్రభుత్వం 2025 సెలవుల జాబితా విడుదలు చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది మొత్త 24 పబ్లిక్ హాలిడేస్, 31 రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉన్నాయి. 24 పబ్లిక్ బాలిడేస్ జాబితాలో 14 సెలవులు ఆదివారం, శనివారం ఉండటం గమనార్హం.
జనవరి 26 రిపబ్లిక్ డే శనివారం
మార్చ్ 29 హోలి శనివారం
ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ జయంతి సోమవారం
మే 1 లేబర్ డే గురువారం
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే శుక్రవారం
అక్టోబర్ 2 గాంధీ జయంతి
అక్టోబర్ 23 దసరా
నవంబర్ 12 దీపావళి
నవంబర్ 13 గోవర్ధన్ పూజ
నవంబర్ 14 చిల్డ్రన్స్ డే
డిసెంబర్ 25 క్రిస్మస్
డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుక
ఇవి కాకుండా 31 రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉన్నాయి. ఇవి జనవరి 1, మకర సంక్రాంతి, మహా శివరాత్రి విమెన్స్ డే, శ్రీ రామనవమి, ఎర్త్ డే, పర్యావరణ దినోత్సవరం, మొహర్రం, రక్షాబంధన్, గణేశ్ చతుర్ధి, విజయజశమి, కర్వా చౌత్, మీలాద్ ఉన్ నబి, గీతా జయంతి, క్రిస్మస్ ఉన్నాయి.
Also read: Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి