Puducherry Night curfew from 11 pm to 5 am till 31st January 2022 : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి (Puducherry Night curfew) కూడా చేరింది. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, అసోం తదితర రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఒమిక్రాన్ కేసులు (Omicron cases) పెరగడంతో కేరళలో తాజాగా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఢిల్లీలో అయితే మెట్రో, రెస్టారెంట్లు, బార్లలో 50శాతం మందికే అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్లు, స్పాలు, జిమ్‌లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


Also Read : New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?


తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో (union territory of Puducherry) కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మొదట న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అక్కడ నైట్ కర్ఫ్యూ (night curfew) విధించారు. అయితే రీసెంట్‌గా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించాలని పుదుచ్చేరి (Puducherry) ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పాండిచ్చేరిలో ఆంక్షలు అమలులో ఉంటాయి. పాండిచ్చేరిలో ఒక్క వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) రోజు మినహా జనవరి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. న్యూ ఇయర్ (New Year) ప్ర‌జలంతా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ంటూ పాండిచ్చేరి ప్రభుత్వం సూచించింది.


Also Read : Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్స్.. ఈ ఏడాది ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook