New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?

New Year Cake 2022: ఇప్పటివరకు ఎన్నో ఫ్లేవర్స్​తో చేసిన కేక్​లు తిని ఉంటాం. మరి మ్యాంగో ఛీజ్​ కేక్ ఎప్పుడైనా తిన్నారా?​ తినకపోయి ఉంటే న్యూఇయర్ సెలెబ్రేషన్ లో భాగంగా ఇంట్లోనే తయారుచేసుకుని రుచి చూసేయండిలా!  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 01:39 PM IST
New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?

New Year Cake 2022: న్యూఇయర్ సందర్భంగా జరిగే సెలెబ్రేషన్స్ లో కేక్ తప్పనిసరిగా ఉంటుంది. దీంతో పాటు పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది కేక్​. ఇలాంటి సమయాల్లో కేక్ కట్​ చేసి తింటూ సెలబ్రేషన్స్​ చేసుకోవడం మనకు అలవాటే. భిన్నమైన ఫ్లేవర్స్​లో దొరికే ఈ కేక్​ను ఏదో ఒక బేకరీ నుంచి కొనుగోలు చేయడమో.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారుచేసుకోవడమో చేస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా మ్యాంగో ఛీజ్​ కేక్​ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. అందుకోసం దీని తయారీ విధానం మీకోసం. 

కావాల్సిన పదార్థాలు

10 బిస్కెట్లు, వెన్న- 50 గ్రాములు z, పన్నీర్- 30 గ్రాములు, క్రీమ్​ ఛీజ్- 30 గ్రాములు, హంగ్​ కర్డ్- 30 గ్రాములు​, ఫ్రెష్​ క్రీమ్- 30 గ్రాములు, కస్టర్డ్- 50 గ్రాములు​, మ్యాంగో గుజ్జు- 50 గ్రాములు (మ్యాంగో దొరకని పక్షంలో పైనాపిల్ లేదా మ్యాంగో ఫ్లేవర్ ఎసెన్స్, మ్యాంగో డ్రింక్ వాడుకొవచ్చు), జెలిటన్​- 5 గ్రాములు, కొన్ని మామిడి పండు ముక్కలు.

తయారీ విధానం

ముందుగా ఓ బౌల్​లో బిస్కెట్స్​ తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కరిగించిన వెన్న వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్​​ బౌల్​లో​ వేసి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.

ఇంకో గిన్నెలో పన్నీర్​ను మెత్తగా​ చేసుకోవాలి. అందులో క్రీమ్​ ఛీజ్​, హంగ్​ కర్డ్​, ఫ్రెష్​ క్రీమ్​ వేసి కలపాలి. ఆ తర్వాత కస్టర్డ్​, మ్యాంగో గుజ్జు (పైనాపిల్) , బేసిల్​(తులసి), మామిడి పండు ముక్కలు (పైనాపిల్ ముక్కలు), కరగపెట్టిన జెలిటన్​ను వేసి మరోసారి బాగా కలపాలి. దీన్ని మ్యాంగో లేదా పైనాపిల్ క్రీమ్​ అంటారు.

ముందుగా మనం కలిపిపెట్టుకున్న బిస్కెట్​ గుజ్జు మిశ్రమం పైన మ్యాంగ్ లేదా పైనాపిల్​ క్రీమ్​ను వేసి దానిపైనా మామిడి లేదా పైనాపిల్ ముక్కలను నచ్చిన విధంగా పరచాలి. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఫ్రిజ్​లో ఉంచాలి. అంతే.. మీకు కావాల్సిన టేస్టీ మ్యాంగో ఛీజ్​ కేక్​ రెడీ. ​

Also Read: New Year's Eve: 2021లో చివరి డూడుల్ రిలీజ్.. న్యూఇయర్ ఈవినింగ్ డూడుల్ ను చూశారా?

Also Read: Christmas 2021: క్రిస్మస్ పండుగ రోజున ఎంతో ఇష్టంగా తినే వంటకాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News