Weight Loss Surgery: నిండా 30 ఏళ్లు నిండలేదు. స్థూలకాయంతో బాధపడుతున్నాడు. ఉండాల్సిన దానికంటే అత్యధిక బరువుతో బాధపడుతుండడంతో ఆస్ప్రతికి వెళ్లాడు. బరువు తగ్గించేందుకు శస్త్ర చికిత్స చేయిస్తామని వైద్యులు చెప్పారు. ఎలాగైనా సరే బరువు తగ్గాలని భావించిన ఆ యువకుడు శస్త్ర చికిత్సకు అంగీకరించాడు. తీరా చికిత్స చేయించుకోగా.. బరువు తగ్గడం కాదు అతడి ప్రాణమే పోయింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన 'ఓటు'.. వడదెబ్బతో రాలిన పండుటాకులు


పాండిచ్చేరికి చెందిన హేమచంద్రన్‌ (26) అధిక బరువుతో బాధపడుతున్నాడు. అతడి బరువు 150 కిలోలకు పైగా ఉంది. బరువు తగ్గేందుకు చెన్నైలోని బీపీ జైన్‌ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆస్పత్రి వైద్యులు బరువు తగ్గేందుకు శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. దీనికి అంగీకరించి హేమచంద్రన్‌ ఆస్పత్రిలో చేరాడు. ఈనెల 23వ తేదీన ఉదయం హేమచంద్రన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స జరిపారు. చికిత్స జరిగిన కొద్దిసేపటికి అతడి పరిస్థితి విషమించింది. ఆ వెంటనే రేలా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హేమచంద్రన్‌ రాత్రి చనిపోయాడు. అతడి మృతితో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈ శస్త్రచికిత్సకు రూ.8 లక్షలు ఖర్చయ్యాయని తెలుస్తోంది.

Also Read: Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు


ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం హేమచంద్రన్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. హేమచంద్రన్‌ ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ఆస్పత్రి వైద్యులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవగా ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. బరువు తగ్గించడానికి శస్త్ర చికిత్స వికటించడంపై విచారణకు ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఇలాంటి ప్రమాదకర శస్త్ర చికిత్సలపై నిషేధం ఉన్నా ఎలా చేశారనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. నిర్లక్ష్యంగా వ్యహరించిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని అక్కడి పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter