కశ్మీర్: పూల్వామా దాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ..గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు పూల్వామా పాత్రదారులను మట్టుబెట్టిన  భారత బలగాలు ..ఇప్పుడు సూత్రదారుల వేటలో  బిజీగా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కసితో రగిలిపోతున్న జవాన్లు


సహచరులను కోల్పోయామన్న బాధ ఒకవైపు ..ఎలాగైనా ఉద్రవాదులను ఎలాగైనా మట్టబెట్టాలన్న కసి జవాన్లలో కనిపిస్తోంది. ఇండోపాక్ సరిహద్దు ప్రాంతమైన యూరీలో భారీగా బలగాలను తరలిస్తోంది. దీంతో యూరీ సెక్టార్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.


మళ్లీ కవ్వింపు చర్యలు


మరోవైపు పాక్ తన కవ్వింపు చర్యలకు కొనసాగిస్తోంది. అడుగడుగున కాల్పున ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ప్రుస్తుతం నౌషదసెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ మూకల దాడులను బీఎస్ఎఫ్ జవాన్లు  సమర్ధవంతంగా తిప్పకొడుతున్నారు.


టూరీస్టులకు హెచ్చరిక..


పాక్ ప్రేరేపిత చర్యలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మీర్ ఇప్పుడు తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టూరీస్టుల పర్యటనలు రద్దు చేసుకోవాలని ఇండియన్  ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.తాజా ఆదేశాలతో  శ్రీనగర్ లో ఎప్పుడూ టూరిస్టులతో కలకళలాడే దాల్ లేక్ మాసిపోయినట్లుగా కనిపిస్తోంది