Punjab Incident: పంజాబ్ స్వర్ణదేవాలయంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. శిరోమణి అకాళీదళ్ నేత, మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించిన పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే కాల్పులు ఎందుకు జరిపిందీ ఇంకా తెలియలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణదేవాలయంలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్వర్ణదేవాలయం చౌకీదార్‌గా తన వీల్ ఛైర్‌లో కూర్చుని విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. మెడలో పలక, చేతిలో బల్లెంతో కాపలాదారుడిగా ఉండగా ఓ దుండగుడు అతని వద్దకు వచ్చి ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇది గమనించిన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పించాడు. దాంతో దుండగుడి తుపాకీ గాలిలో పేలింది. అదృష్టవశాత్తూ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు ఎలాంటి హాని కాలేదు. 


కాల్పులు జరిపింది ఎవరు


కాల్పులు జరిపిన వ్యక్తిని బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాజీ ఉగ్రవాది నారాయణ సింగ్ చౌరాగా గుర్తించారు. ఇతనిపై చాలా కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. 1984లో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన నారాయణ్ సింగ్ చౌరా పంజాబ్‌లో పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు అక్రమంగా రవాణా చేశాడని పోలీసులు చెబుతున్నారు. గెలిల్లా యుద్ధం, విద్రోహ సాహిత్యంపై ఓ పుస్తకాన్ని కూడా చౌరా పాకిస్తాన్‌లో రచించాడు. బురైల్ జైలు బ్రేక్ కేసులో ఇతడు నిందితుడు. 


Also read: Earth Quake in Telugu States: తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.