Earth Quake in Telugu States: తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

Earth Quake in AP: తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పలుచోట్ల.. భూకంప ప్రకంపనలు వచ్చాయి. భద్రాచలం, విజయవాడ, జగ్గంపేట తో సహా పరిసర గ్రామాల్లో కూడా భూమి కొన్ని నిమిషాల పాటు కనిపించింది. దీంతో అక్కడున్న ప్రజలు.. ఇల్లు, అపార్ట్మెంట్స్ నుంచి భయంతో పరుగులు తీశారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 4, 2024, 08:10 AM IST
Earth Quake in Telugu States: తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!

Earthquake in Telugu States: ప్రస్తుతం ఉన్న వాతావరణం రోజుకొక్కసారిగా మారిపోతూ ఉన్నది. ఎక్కువగా ఇతర ప్రాంతాలలో భూకంపాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అయితే ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూప్రకంపనలు సైతం వచ్చినట్లుగా తెలుస్తోంది.. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం పైన అటు ప్రభుత్వాలు కూడా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా ఉంటామని ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. 

అసలు విషయంలోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు సైతం వచ్చినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం, మణుగురూ, చింతకాని, చర్ల, నాగుల పంచ వంటి మండలాలలో స్వల్ప భూమి కంపించినట్లుగా అక్కడి ప్రజలు గుర్తించడంతో వెంటనే ఇళ్ల నుంచి బయటికి వచ్చేసారట. 

ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. వీటితోపాటుగా రంగారెడ్డి,  హనుమకొండ,  వరంగల్ వంటి జిల్లాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు సైతం వచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఇక ఏపీలో విషయానికి వస్తే.. విజయవాడ నగరం, జగ్గయ్యపేట వంటి పట్టణాలలో కూడా భూప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఇళ్లలో నుంచి అపార్ట్మెంట్లో నుంచి ప్రజల సైతం భయాందోళనతో బయటికి రావడంతో ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. 
అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలోని మార్పుల వల్లే ఇలా జరిగి ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు.. 

రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగబోయేవి ముందుగానే తెలియజేస్తామంటూ తెలియజేస్తున్నారు.. మరి ఈ భూప్రకంపం పై.. రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయాలను తీసుకుంటారు చూడాలి మరి.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News