Punjab Patiala High Tension: పంజాబ్‌లో శివసేన శ్రేణులకు, ఖలీస్తాన్ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం (ఏప్రిల్ 29) పటియాలాలోని కాళీ మాత ఆలయం ఎదుట ఇరు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం 11 గంటల కర్ఫ్యూ విధించింది. తాజాగా పటియాలాలో ఎస్ఎంఎస్‌ సేవలతో పాటుమొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం (ఏప్రిల్ 30) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిచిపోనున్నాయి. పటియాలాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ఇతర ప్రాంతాలకు పాకే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో తప్పుడు ప్రచారానికి తెరపడుతుందని ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


పటియాలాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. పటియాలా ఐజీ రాకేశ్ అగర్వాల్, పటియాలా ఎస్‌ఎస్‌పీ పోలీస్ నానక్ సింగ్, ఎస్పీ వజీర్ సింగ్‌లను బదిలీ చేశారు. 


ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటికే శివసేన నేత హరీశ్ సింగ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 29న 'ఖలీస్తాన్ వ్యవస్థాపక దినోత్సవం' సందర్భంగా అంతటా వేడుకలు నిర్వహించాలని నిషేధిత ఎస్‌ఎఫ్‌జే పిలుపునివ్వడంతో హరీశ్ సింగ్లా శివసేన కార్యకర్తలతో కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుమతి లేకుండానే ఆయన ర్యాలీ నిర్వహించడం... అది ఖలీస్తాన్ మద్దతుదారులతో ఉద్రిక్తతలకు దారితీయడం జరిగింది. హరీశ్ సింగ్లాను శివసేన పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అతనిపై వేటు వేసినట్లు తెలిపింది. 


Also Read: Acharya Movie Collection: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా?


Also Read: Kiara Advani Oops Moment: స్లిట్ కట్ డ్రెస్‌లో కియారా అద్వానీ... కవర్ చేసుకోలేక ఎలా అవస్థ పడిందో చూడండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook