Punjab CM Bhagwant Mann Second Marriage: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇవాళ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. చండీగఢ్‌లోని అధికారిక నివాసంలో భగవంత్ మాన్-గురుప్రీత్ కౌర్‌ల వివాహం జరగనుంది. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న దాదాపు ఏడేళ్లకు భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్ ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇంతకీ గురుప్రీత్ కౌర్.. ఆమె నేపథ్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భగవంత్ మాన్ వయసు 48 ఏళ్లు కాగా.. గురుప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. అంటే.. ఇద్దరి మధ్య 16 ఏళ్ల వయసు తేడా ఉంది. గురుప్రీత్ కౌర్ స్వగ్రామం కురుక్షేత్ర జిల్లాలోని పెహోవా. ఆమె తండ్రి ఇందర్‌జిత్ సింగ్ ఒక రైతు. గతంలో మదన్‌పూర్ గ్రామానికి సర్పంచ్‌గా కూడా పనిచేశారు. తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. గురుప్రీత్ కౌర్‌కి ఇద్దరు అక్కలు. ప్రస్తుతం ఆ ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. 


హర్యానాలోని మౌలానాలో ఉన్న మహర్షి మార్కండేశ్వర్ మెడికల్ కాలేజీలో గురుప్రీత్ కౌర్ ఎంబీబీఎస్ చదివారు. 2013లో ఎంబీబీఎస్‌లో చేరిన ఆమె 2018లో పూర్తి చేశారు. గురుప్రీత్ కౌర్ గోల్డ్ మెడలిస్ట్ అని ఆమె మామయ్య గురీందర్ సింగ్ తెలిపారు.గురుప్రీత్ కౌర్ చదువుల్లో ఎప్పుడూ ముందుండేదని పేర్కొన్నారు. గురుప్రీత్ కౌర్ చాలా సహృదయురాలు అని, తెలివిగల అమ్మాయి అని ఆమె ఇంటి పొరుగున ఉండే వ్యక్తి ఒకరు చెప్పారు. ఇరుగు పొరుగు అంతా ఆమెను ప్రేమగా 'గోపీ దీదీ'గా పిలుస్తామని తెలిపారు.


గురుప్రీత్ కౌర్ ప్రస్తుతం ఫిజిషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్ కుటుంబానికి గురుప్రీత్ కౌర్ కుటుంబంతో చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.


కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం కొద్దిమంది ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయంతో భగవంత్ మాన్ సీఎం అయ్యారు. భగవంత్ మాన్ మొదటి భార్య, పిల్లలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.


Also Read: Horoscope Today July 7th: నేటి రాశి ఫలాలు.. సంతానం కోసం ఎదురుచూసే ఈ 2 రాశుల వారికి శుభవార్త ఉండొచ్చు..


Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook