Punjab election result 2022: పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది. ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) జోరు ముందు కీలక నేతలు సైతం నిలవలేకపోతున్నారు. ఇప్పటికే పంజాబ్​లో ఆప్​ అధికార పగ్గాలు చేపట్టనుండటం దాదాపు ఖరారైంది. ఆరంభం నుంచే ఆప్​ మ్యాజిక్ ఫిగర్​కన్నా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖుల ఓటమి..


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఓటమిపాలయ్యారు. ప్రస్తుత సీఎం చరణ్​జిత్ సింగ్​ చన్నీ చమ్​కౌర్ సాహిబ్, బదౌర్ స్థానాల నుంచి బరిలో దిగారు. రెండు చోట్లా ఆయనకు ఓటమి ఎదురైంది. మరో మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. రెండు స్థానాల్లో సైతం ఆప్​ అభ్యర్థుల చేతిలోనే ఓటమిపాలయ్యారు చన్నీ.


బదౌర్ స్థానంలో ఆఫ్ అభ్యర్ఱథి లబ్​ సింగ్​ ఉగోకెకు మొత్తం 57 వేల ఓట్లు రాగా.. చన్నీకి 23 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక చమ్​కౌర్ ప్రాంతంలో మాత్రం చన్నీకి 50 వేల ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థికి 54 వేల ఓట్లు రావడం గమనార్హం.


సిద్ధూ ఓటమి..


పంజాబ్​ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్​ సిద్ధూ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అమృత్​సర్​ తూర్పు నుంచి బరిలో దిగారు సిద్ధూ.


ఇక పంజాబ్ కీలక నేతలు చాలా మంది ఓటమిపాలయ్యారు. శరోమణి అకాలీదల్ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్ బాదలు, మాజీ ముఖ్యమంత్రి  కెప్టెన్​ అమరిందర్​ సింగ్​లు కూడా ఎన్నికల్లో ఓటిపోయారు.


ఇక నటుడు సోనూ సూద్​ సోదరి మాళవికా కూడా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్​కు కంచుకోట అయిన మోగా నుంచి అమె పోటీ చేశారు. అయితే ఆప్​కు చెందిన సమీప అభ్యర్థి చేతిలో అమె ఓడిపోయారు.


సంబరాల్లో ఆప్..


ఢిల్లీ తర్వాత ఆప్​ అధికారంలోకి రానున్న రాష్ట్రం పంజాబ్​. దీనితో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా భగవంత్​ మాన్​ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ ప్రజల తీర్పుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఇప్పటికే ఆనందం వ్యక్తం చేశారు.


Also read: Pujab Polls Result 2022: పంజాబ్‌ ఎన్నికల్లో సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ ఓటమి


Also read: Uttarakhand Election Result 2022: ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌రావత్‌ ఓటమి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook