AAP Punjab CM Candidate: పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ (Bhagwant Mann) పేరు ఖరారు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party). ఈ విషయాన్ని ఆమ్​ ఆద్మీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ (Arvind Kejriwal)​ మంగళవారం ప్రకటించారు. పంజాబ్‌లోని 3 కోట్లకు పైగా జనాభాలో 21,59,437 మంది తమ సర్వేలో స్పందించారని కేజ్రీవాల్​ వెల్లడించారు. వీరిలో 93.3 శాతం మంది సర్దార్ భగవంత్ మాన్ పేరు సూచించారని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుపు పక్కా. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి పంజాబ్ తదుపరి సీఎం అవుతాడు" అని కేజ్రీవాల్ మొహాలీలోని ఒక ఆడిటోరియంలో అన్నారు. ప్రస్తుతం సంగ్రూర్​ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు భగవంత్​ మాన్. పంజాబ్​ ఎన్నికలకు సీఎం అభ్యర్థినికి ప్రకటించిన తొలిపార్టీగా ఆమ్​ ఆద్మీ పార్టీ నిలిచింది.


Also Read: Good news: హిమాల‌యాల్లోని మొక్క‌ల‌తో క‌రోనాకు చెక్…!!


పంజాబ్‌ (Punjab Assembly Election 2022)లో ఫిబ్రవరి 20న  117 స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా పార్టీ సీఎం అభ్యర్థి పేరును ప్రతిపాదించాలని కోరుతూ ఆప్‌ ఇటీవల ఓ మొబైల్‌ నెంబర్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నెంబర్‌ ద్వారా ప్రజలు తమ ఫీడ్‌ బ్యాక్‌ను అందించాలని కోరింది. అయితే 96 గంటల్లో 19 లక్షల మంది నుంచి ఫీడ్‌ బ్యాక్‌ పార్టీకి అందిందని ఆప్‌ నేత హర్పాల్‌ సింగ్‌ చీమా అన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook