IIT-Mandi team finds plant to help fight Covid infection: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే మెుక్కలను హిమాలయాల్లో (Himalaya's) గుర్తించారు పరిశోధకులు. హిమాలయాల్లో పెరిగే 'రోడో డెండ్రాన్ అర్బోరియం' (Rhododendron arboreum) అనే మొక్కలోని పూరేకుల్లో ఫైటోకెమికల్స్ ఉన్నాయని, ఈ ఫైటో కెమికల్స్‌కు (Phytochemicals) కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందని ఐఐటి మండి (IIT Mandi), ఐసీజీఈబీ (ICGEB) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా 'బురాన్ష్'గా పిలుస్తారు. ఈ అధ్యయనం ఇటీవలే 'బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్' జర్నల్‌లో ప్రచురితమైంది.
హిమాలయాల్లో దొరికే బురాన్ష్ మొక్కల (Himalayan Buransh Plant) పూరేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికత్సల్లో వాడుతున్నారు. ఈ పూరేకుల్లో వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు ఐఐటీ మండి అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా యాంటీవైరల్ గుణాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. టీకాలు కాకుండా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇతర పద్దతులపై ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మొక్కల నుంచి లభించే ఆయుర్వేద ఔషదాలు శరీరంలోని కణాల్లోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటాయని, వైరస్‌ను అడ్డుకునే శక్తిని శరీరానికి కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు.
Also Read: Metaverse Wedding Reception: దేశంలోనే తొలిసారి 'మెటావర్స్'లో వివాహ రిసెప్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook