Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
Farmer protests Updates - Punjab farmer suicide: న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఈ (Farm laws) ఆందోళనలో పాల్గొంటున్న రైతులు ఇప్పటికే పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
శనివారం సింఘు (Delhi Borders) బోర్డర్ వద్ద 40 ఏళ్ల అమరీందర్ సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆందోళనలో పాల్గొంటున్న పంజాబ్‌లోని పతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందిన అమరీందర్ సింగ్ విషం తాగాడు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడని హర్యానా, సోనిపట్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ రైతు ఆందోళనల్లో ఇప్పటికే పలువురు రైతులు మృతి చెందారు. Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య
అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు (Farmers Organizations) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా.. ఈ చట్టాల్లో సవరణలు మాత్రం చేస్తామని కేంద్రం (Central Government) స్పష్టంచేసింది. ఈ క్రమంలో జనవరి 15న తొమ్మిదోసారి మరలా చర్చలు జరగనున్నాయి. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook