Sir Chhotu Ram Award 2022: సీఎం కేసీఆర్‌కు సర్ ఛోటురామ్ అవార్డును పంజాబ్ రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ అవార్డును హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ అవార్డును ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందుకున్నారు. పంజాబ్ రైతు నాయకులు మాట్లాడుతూ.. భారత రైతాంగ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహాయజ్ఞం మొదలుపెట్టారని అన్నారు. దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయమని.. ఇందులో విశేషమైన మార్పు రావాలన్నది కేసీఆర్ సంకల్పమన్నారు. ఆహార రంగంలో  అతి గొప్ప ఉపాధి అవకాశాలు ఉన్నవని.. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ కనిపించట్లేదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేసి కొత్త దారి చూపాలన్న తపనతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీనికి మేధావులు, రైతు నాయకులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. మోదీ ప్రభుత్వ నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది పైచిలుకు రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోయింది. 


'రైతుల పోరాటానికి తలొగ్గి, నిస్సిగ్గుగా జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్..నా చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఆలోచన తట్టలేదు. కానీ ఎక్కడో పంజాబ్‌కు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల ఎల్లలు దాటి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించారు. ఇది ఆర్థిక చేయూత మాత్రమే కాదు.. రైతుల కష్టాలలో భాగం పంచుకునే ఒక గొప్ప ముఖ్యమంత్రిని కేసీఆర్‌లో చూస్తున్నాం..' అని వారు అన్నారు.


సర్ ఛోటురామ్ ఎవరు..? 


పంజాబ్ రైతులు ప్రధానంగా ఇద్దరు వ్యక్తులను ఆరాధిస్తారు. ఒకరు సర్ ఛోటు రామ్, మరొకరు స్వామినాథన్. 1881లో పంజాబ్ ప్రావిన్స్‌లో సర్ ఛోటురామ్ ఝాట్ కుటుంబంలో జన్మించారు. యునైటెడ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పాలించిన నేషనల్ యూనియనిస్ట్ పార్టీకి ఆయన సహ వ్యవస్థాపకులు. అప్పట్లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌లను తన పార్టీకి దూరంగా ఉంచారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నాటి పంజాబ్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్ ఛోటు రామ్ 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషి చేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. హరితవిప్లవంతో స్వామినాధన్ పంజాబ్ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు.


Also Read: Fastest Ball By Indian Bowler: టీమిండియా తరుఫున అత్యంత వేగవంతమైన టాప్-5 బౌలర్ల వీళ్లే..   


Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook