Tractor Rally Delhi: ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల పరిహారం
Tractor Rally Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున (జనవరి 26) జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో (Farmers Tractor Rally) పాల్గొని అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం (Farmers protest) చేస్తున్న రైతులకు (Tractor rally) మద్దతు ప్రకటించారు సీఎం చరణ్ జీత్ చన్నీ.
Tractor Rally Delhi: సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో (Farmers Tractor Rally) పాల్గొని అరెస్టయిన 83మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చరణ్ జీత్ చన్నీ ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం (Delhi Farmers Protest News) చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు.
“సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు మా ప్రభుత్వ మద్దతు ఉంటుందని మరోమారు చెబుతున్నా. జనవరి 26న (రిపబ్లిక్ డే) దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించాం” అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ అన్నారు.
అయితే.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పంజాబ్ ప్రభుత్వం వారికి ఆర్థికసాయం ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే నాడు రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీకి (Farmers Tractor Rally) పోలీసులు షరతులతో అనుమతించారు. నిర్దేశించిన మార్గాల్లోనే ర్యాలీ (Delhi Farmers Protest News) చేపట్టాలని ఆంక్షలు విధించారు. కానీ ర్యాలీ ప్రారంభమైన కాసేపటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి అనుమతిలేని మార్గాల గుండా ఎర్రకోటకు చేరుకున్నారు. ఆ తర్వాత విధ్వంసకర ఘటనలు (Tractor Rally Violence) చోటుచేసుకున్నాయి. అందుకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..
Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook