Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..

Tamilnadu Lady Police: వరదల బీభత్సం తర్వాత చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీ చత్రం పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ రాజేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్పృహతప్పిన ఓ వ్యక్తిని తన భుజాలపై ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలను నిలబెట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 04:51 PM IST
Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..

Tamilnadu Lady Police: తమిళనాడులో వరదలు సృష్టించిన బీభత్సంతో (Tamil Nadu Rain) అల్లాడుతున్న చెన్నైలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. ఇప్పటికే 14 మంది మృతిచెందారు.. చాలా మంది ఇళ్లలోనే మగ్గుతున్నారు.. కనీసం తిండి కూడా లేకుండా అల్లాడిపోయేవారు కూడా ఉన్నారు.. ఇక, జనజీవనం స్తంభించిపోయింది. శుక్రవారం ఉదయం వర్షం తెరపించడం వల్ల అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీ చత్రం పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ రాజేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు (Tamil Nadu Rain Updates). ఉదయ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. 

స్థానిక శ్మశానవాటికలో పనిచేసే ఉదయ.. వర్షాల కారణంగా కొన్నిరోజులుగా అక్కడే ఉండిపోయాడు. వర్షాలకు తడిసి స్పృహకోల్పోయాడు. గురువారం ఆయన్ని చూసిన స్థానికులు ఉదయ మరణించాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లేసరికి ఆయన బతికే ఉన్నాడని పోలీసులకు తెలిసింది. వెంటనే ఉదయను ఆ మహిళా పోలీసు తన భుజాలపై మోసుకెళ్లి పరుగులుతీస్తూ ఆటో ఎక్కించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని సమయస్ఫూర్తితో రక్షించారంటూ ఆమెపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరకు చేరింది. దీంతో.. శుక్రవారం ఉదయం రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించుకున్న సీఎం స్టాలిన్.. ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఇస్పెక్టర్‌ రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్.. ప్రశంస‌లు కురిపించారు. ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. మొత్తంగా విధి నిర్వహణలో ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు.. ముఖ్యమంత్రి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు రాజేశ్వరి. 

Also Read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ

Also Read: Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News