Punjab Night Curfew: కరోనా మహమ్మారి సంక్రమణ వేగం పుంజుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా..విద్యాసంస్థలు మూసివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైందనే సంకేతాల వెలువడుతున్నాయి. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ వైద్యులు అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. దేశమంతా కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం అదే బాటపట్టింది. 


కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు పంజాబ్ కూడా నైట్‌కర్ఫ్యూ (Night Curfew) విధించింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ జనవరి 15 వరకూ అమల్లో ఉంటుంది. దాంతోపాటు విద్యాసంస్థలు, కళాశాలలు మూసివేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని సమీక్షించిన తరువాత కొత్త ఆంక్షలు అమలవుతున్నాయి. పబ్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్ధ్యంతో పనిచేస్తాయి. రాష్ట్రంలో బస్సులు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడవనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నవారికే అనుమతి ఉంటుంది. సినిమా హాళ్లు, మాల్స్ కూడా 50 శాతం సామర్ధ్యంతోనే నడపాల్సి ఉంటుంది. 


రాష్ట్రంలో రాక్ గార్డెన్, బర్డ్ ఏవియరీ పార్క్‌లను తక్షణం మూసివేశారు. పంజాబ్‌లో గత 24 గంటల్లో 419 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6 లక్షల 5 వేల 922 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో 16 వేల 651 మంది మరణించగా, 1741 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


Also read: India Corona Update: దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. 37,379 కేసులు, 124 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి