Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Hathras Case: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి ((hathras gang rape) గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యాచారాలను నిరోధించడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, యూపీలోని ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు ప్రధాన నగరాల్లో నిరసనలు సైతం తెలుపుతున్నాయి. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హత్రాస్ బయలుదేరారు. దీంతో పోలీసులు వారి వాహనాలను యూపీ సరిహద్దులోనే నిలిపివేశారు. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
దీంతో యమునా ఎక్స్‌ప్రెస్ వే నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాలి బాటనే హత్రాస్‌కు బయలు దేరారు. తన వాహనాలను నిలిపివేసిన క్రమంలో పోలీసులు తనను నెట్టివేశారని, తనపై లాఠీచార్జ్ కూడా చేసి కిందపడేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం మోదీజీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వాహనాలను అడ్డుకోవడం వల్ల నడక ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. హత్రాస్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రోడ్డు మార్గంలో కాలిబాటన నడకను ప్రారంభించారు. Also read : Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం