Hathras gang rape case live news updates: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీఘడ్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో బాధితురాలు అత్యాచారానికి గురైనట్టుగా నిర్ధారించలేదని హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ ( Hathras SP Vikrant Vir ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ మెడికల్ కాలేజీ ఇచ్చిన నివేదికలో ( Medical report from Aligarh Muslim University Medical College ) బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నట్టుగా మాత్రమే ఉంది కానీ.. ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధృవీకరించలేదని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్ట్ ( Forensic report ) కోసం వేచిచూస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ( SIT ) విచారణ నిమిత్తం బుధవారం బాధితురాలి గ్రామానికి చేరుకుని ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు ఎస్పీ తెలిపారు. ఘటన స్థలాన్ని సైతం కమిటీ పరిశీలించిందని.. టీమ్ ఇంకా గ్రామంలోనే ఉండి విచారణ జరుపుతోందని ఎస్పీ వెల్లడించారు. Also read : Hathras rape case: గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలి తండ్రికి సీఎం ఫోన్
#WATCH: #Hathras SP says, "Medical report from Aligarh hospital mentions injuries but doesn't confirm forced sexual intercourse. They're waiting for report of Forensics. As of now, doctors say that they're not confirming rape, can give firm opinion only when they get FSL report." pic.twitter.com/R2HK0zZ6Pv
— ANI UP (@ANINewsUP) October 1, 2020
అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు తమ కూతురిపై సామూహిక అత్యాచారానికి ( Gang rape ) పాల్పడి, దారుణంగా హింసించారని... వారిలో దాడిలో గాయపడిన కారణంగానే ఆమె ప్రాణాలు వదిలిందని బాధితురాలి కుటుంబం ( Hathras rape case victim's family ) ఆరోపిస్తుండగా.. తాజాగా అలీఘడ్ మెడికల్ కాలేజీ మెడికల్ రిపోర్టు అందుకు భిన్నంగా రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. Also read : Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం
హత్రాస్ రేప్ కేసు బాధితురాలు మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐతే, అంతకంటే ముందుగా అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన ఈ మెడికల్ కాలేజీలోనే వైద్యులు బాధితురాలికి చికిత్స అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe