Petrol price hike: కేంద్రంపై రాహుల్ గాంధీ సెటైర్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఫైర్!
Petrol price hike: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లపై ఓ ట్వీట్ చేశారు.. అందులో ఏముందంటే..
Petrol price hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోంది. బుధవారం కూడా ధరలు మరింత ప్రియమయ్యాయి. గడిచిన 10 రోజుల్లో రేట్లు పెరగటం ఇది నాలుగో సారి. దీనితో వాహనదారులు, సామాన్యుల జేబుకు చిల్లుపడుతోంది. ప్రతి రోజూ ఇలా ధరలు పెరుగుతూ పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.
ఇక ఇదే విషయమై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా.. కేంద్రంపై సెటైర్ వేశారు. ఆసియాలని వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో చెబుతూ ఓ ట్వీట్ చేశారు.
రాహుల్ ట్వీట్లో ఏముంటే..
లీటర్ పెట్రోల్ పెట్రోల్ ధర వివిధ దేశాల్లో ఎంత ఉన్నాయి? అనే వివరాలు రాహుల్ గాంధీ ట్వీట్ ప్రకారం..
అఫ్గానిస్తాన్ రూ.66.99
పాకిస్థాన్ రూ. 62.96
శ్రీలంక రూ.72.96
బంగ్లాదేశ్ రూ.78.28
భూటాన్ రూ.86.28
నేపాల్ రూ.97.05
ఇండియా రూ.101.81
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పెట్లోల్, డీజిల్ ధరలు సహా.. వంట గ్యాస్ ధరలను పెంపును నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్కు పూల మాలల వేసి నిరసన వ్యక్తం చేశారు.
పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగతున్నాయి?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనితో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. అయితే 10 రోజుల క్రితం ముందు కూడా ముడి చమురు ధరలు భారీగా పెరిగినా.. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ధరల పెరగకుండా కేంద్రం అడ్డుకోగలిగిందనేది విపక్షాల వాదన.
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత.. కొన్ని రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతుండటం పట్ల అంటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది.
Also read: Bengaluru Rape: బెంగళూరులో దారుణం... నర్సుపై నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్...
Also read: కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook