కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ...

Attack on Kejriwal House: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం శ్రేణులు ఢిల్లీలోని ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 07:21 PM IST
  • కేజ్రీవాల్ నివాసంపై బీజేవైఎం దాడి
  • ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ దాడి
  • హత్యకు కుట్ర పన్నారని ఆరోపించిన ఆప్
కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ...

Attack on Kejriwal House: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజకీయ రచ్చకు కారణమైంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన  ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా పై ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  బీజేవైఎం ఆందోళన చేపట్టింది.  సీఎం ఇంటి వద్దకు భారీగా చేరిన బీజేవైఎం కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వెళ్లి కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటును ధ్వంసం చేశారు. కేజ్రీవాల్ ఇంటి గేటుకు కాషాయ రంగు చల్లారు.

బీజేపీ  యుమోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య  నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. తేజస్వీ సూర్య  స్వయంగా బారికేడ్లు ఎక్కారు. సూర్య బారికేడ్లు దూకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  దాదాపు 200 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  బీజేవైఎం ఆందోళనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది. సీఎం కేజ్రీవాల్‌ ఇంటి వద్ద బీజేపీ  గూండాలు విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కేజ్రీవాల్ నివాసంపై జరిగిన దాడిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారని.. కేజ్రీవాల్‌ను ఎన్నికల్లో ఓడించలేకపోయినందునా.. ఆయన హత్యకు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ఓటమి తర్వాత బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే  కేజ్రీవాల్‌ను చంపాలని ఆ పార్టీ కోరుకుంటోందని మండిపడ్డారు.  మరోవైపు, బీజేపీ మాత్రం ఆప్ ఆరోపణలను ఖండించింది. బీజైవైఎం కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారని తెలిపింది.

ఇంతకీ కేజ్రీవాల్ 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఏమన్నారు..:

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. 'ఈ సినిమాకు ఢిల్లీలో ట్యాక్స్ మినహాయింపునివ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానికి బదులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. అప్పుడు అందరూ ఉచితంగా చూడగలుగుతారు. కశ్మీర్ పండిట్స్ పేరు చెప్పుకుని కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బీజేపీ ఆ సినిమా పోస్టర్స్ అంటిస్తోంది.' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు కశ్మీర్ పండిట్స్‌ను అవహేళన చేయడమేనని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు, కేజ్రీవాల్ మాత్రం.. కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాల్సిందిపోయి సినిమా తీస్తే ఏమొస్తుందని ప్రశ్నిస్తున్నారు.

Also Read: PAN-Aadhaar link: రేపే లాస్ట్ డేట్.. ఆధార్​-పాన్ లింక్ చేయకుంటే రూ.1,000 జరిమానా!

Also read: DA Hike: ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- మరో 3 శాతం పెరిగిన డీఏ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News