Rahul Gandhi Dog Biscuit: కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తన యాత్రలో ఓ వ్యక్తికి కుక్కకు ఇచ్చే బిస్కెట్‌ తినమని ఇచ్చాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా వ్యవహరించాడని చెబుతూ బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'రాహుల్‌ తన మద్దతుదారులు, అనుచరులను కుక్కల్లా చూస్తున్నారు' అంటూ బీజేపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు. ఈ వివాదంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 'రాహుల్‌ గాంధీ ఒక్కడే కాదు ఆ కుటుంబం మొత్తం ఆ బిస్కెట్‌ తినదు. నేను అలాంటిది తినకుండా తిరస్కరించి కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. ఒక అస్సామీగా.. భారతీయుడిగా గర్వపడుతున్నా' అని సీఎం హిమంత 'ఎక్స్'లో పోస్టు చేశాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cockroach Vande Bharat Train: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన


ఈ వివాదం నేపథ్యంలో రాహుల్‌ను మీడియా ప్రశ్నించింది. మీడియా సమావేశంలో ప్రశ్నలు ఎదుర్కొంటున్న రాహుల్‌కు 'కుక్క బిస్కెట్‌' అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 'మీ కార్యకర్తకు కుక్క బిస్కెట్‌ తినమని చెప్పారా? దానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది' అని విలేకరి ప్రశ్నించారు. రాహుల్‌ స్పందిస్తూ 'యాత్రలో కుక్కపిల్లను చూసి దాన్ని పట్టుకున్న వ్యక్తిని పైకి పిలిపించా. కుక్కపిల్లకు బిస్కెట్‌ తినిపిస్తుంటే అది భయపడది. నేను తినిపిస్తుంటే తినడం లేదని యజమానికి బిస్కెట్‌ ఇచ్చా. నువ్వు తినిపిస్తే అది తింటది అని చెప్పి ఆ బిస్కెట్‌ అతడికి ఇచ్చా అంతే! అతడు తినిపించగానే కుక్క బిస్కెట్‌ను తినేసింది. ఇందులో సమస్య ఏముంది?' అని రాహుల్ ఎదురు ప్రశ్నించారు.

Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు


వివాదం ఇలా..?
భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ జార్ఖండ్‌లో పర్యటించారు. యాత్ర చేపడుతూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి పట్టుకున్న కుక్కపిల్లను చూశాడు. వెంటనే అతడిని పైకి రమ్మని పిలిచారు. వాహనంపైన కుక్కపిల్లకు బిస్కెట్‌ తినిపించే ప్రయత్నం చేయగా తినలేదు. దీంతో ఓ వ్యక్తికి కుక్క బిస్కెట్‌ ఇచ్చారు. బిస్కెట్‌ అతడికి ఇవ్వడం వివాదమైంది. 'మనుషులను కుక్కలుగా కాంగ్రెస్‌ భావిస్తోంది' అని విమర్శలు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. రాహుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook