కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ గుజరాత్ లో తొలిదశ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన నవంబర్ 24, 25 తేదీల్లో ఎన్నిక ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా రాహుల్.. సనంద్, పోరుబందర్, అహ్మదాబాద్, గాంధీనగర్, మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. డాక్టర్లు, టీచర్లు, మత్స్యకారులు, దళితులు.. తదితర వర్గాల ప్రజలను కలుసుకుంటారు. మొదటిరోజు (శుక్రవారం) ప్రచారాన్ని 'బాపూ పుట్టిన ప్రదేశం' పోరుబందర్ నుంచి ప్రారంభించనున్నారు రాహుల్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10:45 am : కీర్తి మందిర్, పోరుబందర్ 


11:15 am : మత్స్యకారులతో సమావేశం, ఫిషింగ్ హార్బర్ గ్రౌండ్, పోరుబందర్ 


14:40 pm : దళిత్ స్వాభిమాన్ సభలో ప్రసంగం, సనంద్- బావ్లా రోడ్, అహ్మదాబాద్


16: 15 pm : డాక్టర్లతో సమావేశం, తకోరిబాయి దేశాయ్ హాల్, లా గార్డెన్, అహ్మదాబాద్ 


17:30 pm: షహీద్ వీర్ మంగళ్ పాండే హాల్ లో టీచర్లతో సమావేశం, అహ్మదాబాద్ 


19:30 pm: బహిరంగ సభ, ఓపెన్ గ్రౌండ్, కుంజ్ మాల్ ఎదురుగా, నికోల్, అహ్మదాబాద్ 


శనివారం గాంధీనగర్, అర్వల్లి,మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో పర్యటిస్తారు. 


గుజరాత్ లో డిసెంబర్ 9, 14వ తేదీలలో రెండుదఫాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 18న వెలువడుతాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో మొదటి దఫా ఎన్నికలు 89 స్థానాలకు జరుగుతాయి.  మిగిలిన 93 స్థానాలకు ఉత్తర గుజరాత్ లో రెండవ దఫా ఎన్నికలు జరుగుతాయి.