Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురవడంతో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉండగా గైర్హాజరయ్యాడు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. రాహుల్‌ అనారోగ్యానికి గురవడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌


లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేతగా ఉన్న రాహుల్‌ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇండియా కూటమిలో భాగమైన పార్టీలకు మద్దతుగా కూడా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆదివారం ఇండియా కూటమి భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అనంతరం సాత్నా సభలో కూడా పాల్గొనాల్సి ఉంది. అస్వస్థతకు గురవడంతో ఈ రెండు సభలకు రాహుల్‌ గాంధీ ఆకస్మికంగా గైర్హాజరయ్యాడు.

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు


 


ఈ సభకు రాహుల్‌ గైర్హాజరుపై ఇండియా కూటమిలో కలకలం రేపింది. కొద్దిసేపటికి పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ఒక ప్రకటన చేశారు. 'రాహుల్‌ ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యం కారణంగా సాత్నా, రాంచీల్లో జరిగే తన పర్యటనలను రాహుల్‌ గాంధీ రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాడు' అని జైరామ్‌ రమేశ్‌ 'ఎక్స్‌' వేదికగా తెలిపారు. రాంచీలో జరిగిన బహిరంగ సభకు ఇండియా కూటమిలోని 14 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. గత నెలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో 'లోక్‌తంత్ర్‌ బచావో' పేరిట బహిరంగ నిర్వహించారు. ఇప్పుడు రాంచీలో కీలక సమావేశం జరిగింది.


రాంచీ సభకు 14 పార్టీలు
లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యతగా చాటిచెప్పేందుకు ఇండియా కూటమి తరచూ సమావేశాలు నిర్వహిస్తోంది. రాంచీ వేదికగా నిర్వహించిన బహిరంగ సభకు 14 పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ యాదవ్‌, ఢిల్లీ సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ సీఎం భార్య కల్పనా సోరెన్‌ తదితరులు హాజరయ్యారు. జార్ఖండ్‌లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు ఇండియా కూటమి రాంచీ సభ నిర్వహించింది.


ప్రచారంపై ఎండ ప్రభావం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నాయకులపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా సభల్లో పాల్గొంటున్న రాహుల్ ఎండ కారణంగానే అస్వస్థతకు గురయ్యారు. ఇక ఏపీలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఎండల నేపథ్యంలో రాజకీయ నాయకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం, సాయంత్రం పూట ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter