Railway Shock: ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తోంది కేంద్రం. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు రాయితీలు ఎత్తేస్తూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇందులో భాగంగానే రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లుతో పాటు జర్నలిస్టులు, విద్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది.  టికెట్ ధరపై ఎప్పటి నుంచో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్ చేసింది. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలకు పూర్తిగా మంగళం పాడింది. గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సబ్సిడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ సిటిజన్లకు గతంలో ఉన్న రాయితీలను పునరుద్ధరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పష్టం చేశారు. రైల్వే  టిక్కెట్ ధరల రాయితీలపై  గురించి పార్లమెంట్ లో  ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాయితీల వల్ల రైల్వేశాఖపై పెనుభారం పడుతోందని చెప్పారు. ఇప్పటివరకు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీ వల్ల 2017-20 మధ్య కాలంలో 4 వేల 794 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని  కేంద్ర మంత్రి అశ్వినీ తెలిపారు. రాయితీలపై సంస్థకు నష్టం వస్తున్నందునే 
రాయితీలను రద్దు చేశామని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు. 


నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న  రాయితీని కట్ చేసింది. విద్యార్థులకు జర్నలిస్టులు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపేసింది.  50 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం రాయితీ ఇచ్చేది. 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం  రాయితీని అందించేది. జర్నలిస్టులకు 50 రాయితీ ఉండేది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండు సార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం ఉండేది. జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే  విద్యార్థులకు రాయితీలు ఉండేవి. దివ్యాంగులకు కూడా కొన్ని రాయితీలు అందించేది రైల్వే శాఖ. వీటన్నింటిని రైల్వే శాఖ రద్దు చేసింది.


మరోవైపు రైల్వే శాఖకు నష్టాలు రావడానికి కారణాలు చెప్పారు కేంద్రమంత్రి అశ్వినీ  వైష్ణవ్. టికెట్ ధరలు తక్కువగా ఉండటమే రైల్వేల నష్టానికి కారణమని తెలిపారు. కొవిడ్ కారణంగా ప్రయాణికుల  ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్నారు. రైల్వే శాఖపై ఈ  ప్రభావం దీర్గకాలం ఉండబోతుందని చెప్పారు. అందుకే సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు.


Also Read: ముచ్చట సంబరంలో.. బిడ్డకు పాలు పట్టకుండా ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి! నవ్వు ఆపుకోలేరు


Also Read: Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook