Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!

NTR Happy with Bimbisara Movie:  కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాను తాజాగా వీక్షించిన ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 04:53 PM IST
  • విడుదలకు సిద్దంగా బింబిసార
  • తాజాగా వీక్షించిన ఎన్టీఆర్
  • విడుదల చేయడానికి సిద్దమైన టాప్ ప్రొడ్యూసర్
Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!

NTR Happy with Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో బింబిసార అనే సినిమా చేస్తున్నారు, భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించిన నేపధ్యంలో ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎన్టీఆర్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి వీక్షించారని తెలుస్తోంది.

స్వతహాగా డిస్ట్రిబ్యూటర్ కూడా అయిన సదరు ప్రొడ్యూసర్ ఈ సినిమా మొత్తాన్ని తానే డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ముందుకు వచ్చాడని వాదన వినిపిస్తోంది. తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాను ఎన్టీఆర్ కూడా చూసి అభినందించడమే గాక ఈ సినిమాను తానే ప్రెజెంట్ చేస్తానని ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా అవుట్ ఫుట్ బాగుండడంతో పాటు అటు ఎన్టీఆర్ కు ఇటు నిర్మాతకు కూడా సినిమా బాగా నచ్చడంతో దాన్ని వేరే లెవెల్ కు తీసుకువెళ్లి భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

 ఎన్టీఆర్ స్వయంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోకుండా తన అన్న కళ్యాణ్ రామ్ కు సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తాను చేస్తున్న సినిమాలలో సహనిర్మాణం వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు సొంత బ్యానర్ లాంటి ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి ఈ సినిమా వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ మరింత శ్రద్ధ తీసుకొని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ కూడా తన కెరీర్ లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. 

Also Read: Ram Gopal Varma: వాళ్ళ అంతు చూస్తా.. వదిలేదే లేదంటూ సీరియస్ వార్నింగ్

Also Read:  Sithara: అప్పుడే పదేళ్లా.. సితారకు మహేష్-నమ్రతలు ఎమోషనల్ విషెస్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News