Railway: తెలంగాణలో సెపరేట్ కోల్ రెల్వే కారిడార్‌కు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యంగా సింగరేణి గనులున్న ప్రాంతాలను కలుపుతూ ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలోని రామగుండం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్‌ల నడుమ సెపరేట్ 'రైల్వే బొగ్గు కారిడార్‌' ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 207.80 కిలో మీటర్ల మేర ఈ ప్రత్యేక కారిడార్‌ ప్రాంతాల్లో కొత్త బ్రాడ్ గేజ్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసమే వెంటనే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూసేకరణ చేపట్టనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్లే అధికారులకు రైల్వే మంత్రిత్వం శాక ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కోల్ రైల్వే కారిడార్ నిర్మాణానికి దాదాపు రూ. 2911 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. 2013-14 బడ్జెట్‌లో రూ. 10 కోట్ల కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాటాగా నిధులు భరించేందకు ఆసక్తి చూపెట్టలేదు. దీంతో ఈ కారిడార్‌కు ముందడుగు పడలేదు. ఇక ఇది సరుకు రవాణా మార్గం కావడం.. ఆర్ధికంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఈ మొత్తం అంచనా వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడానికి ముందుకొచ్చింది. 2013-14  ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం అప్పట్లో రూ. 1112కోట్లుగా ఉంది. ఇపుడని రూ. 2911 కోట్లకు పెరిగింది.


తగ్గనున్న బొగ్గు రవాణా వ్యయం..


తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ప్రతి యేడాది 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి ఎవ్రీ ఇయర్ బొగ్గు రవాణా కోసమే ఎక్కువగా ఖర్చులు చేస్తోంది. ప్రస్తుతం బలార్షా నుంచి ఖమ్మం ప్రాంతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది.


ఇక రామగుండం - మణగూరు నూతన రైల్వే లైను నిర్మిస్తే.. దాదాపు 142 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. దాంతో బొగ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ రైలు మార్గంలో కాళేశ్వరం, రామప్ప, మేడారం, మంథని, కోటగుళ్లు వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. దాంతో పాటు లక్నవరం చెరువు, బొగతా జలపాతం వంటివి ఉన్నాయి. అవన్నీ ఇందులో కనెక్ట్ అవుతాయి.


మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు లైన్ నిర్మాణం కోసం దాదాపు 25 యేళ్ల క్రితమే బీజం పడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్ విభాగం సర్వే చేపట్టి నివేదిక ఇవ్వనుంది. ఆపై భూసేకరణ చేసి ప్రజాభిప్రాయ సేకరరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook