Revanth Reddy - Tirumala: ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2024, 12:40 PM IST
Revanth Reddy - Tirumala: ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

Revanth Reddy - Tirumala: తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన కూతురు కుమారుడు రేయాన్స్‌కు పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతో కలిసి నిన్ననే తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మనవడికి పుట్టు వెంట్రుకలు ఇచ్చిన తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అంతేకాదు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతేకాదు స్వామి వారి తీర్ధ ప్రసాదాలతో పాటు స్వామి వారి ప్రతిమను  అందజేసారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. రాబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు మెరుగు పరుచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు విభజన జరిగిన జూన్ 2తో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఇంకా కొలక్కి రాని పలు సంస్థలపై వస్తోన్న ప్రతిస్ఠంభనను తొలిగించేలా రాబోయే ప్రభుత్వంతో చర్చలు చేపడతామన్నారు. అంతేకాదు తెలంగాణ రైతులకు మంచి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు కళ్యాణ మండపం కట్టించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తామన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అంతకు ముందు ఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి విజయ తీరాలకు చేర్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి కాగలిగారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చేలా ప్రచారం చేసారు. మరి జూన్ 4 దేశ వ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also read: Samsung Galaxy Z Flip: శాంసంగ్ నుంచి 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో Samsung Galaxy Z Flip 6 ఫోల్డబుల్ ఫోన్ త్వరలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News