Rain Alert: గతకొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవిని తలపించేలా ఉక్కపోత పెట్టింది. చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఐతే ఇవాళ్టి ఉదయం నుంచి వాతావరణం మారినట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత తగ్గింది. మేఘాలు కేంద్రీకృతమైయ్యాయి. నిన్న విదర్భ నుంచి దక్షిణ కోస్తా, ఏపీ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ బలహీపడింది. ఇటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు మరికొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడక్కడ వానలు పడే సూచనలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


మరోవైపు రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీపై ఆవర్తన ప్రభావం అధికంగా ఉంది. ఏపీ తీరం వెంట ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


తీరం వెంట పెనుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. మూడురోజులపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో మరికొన్ని చోట్ల వానలు కురవనున్నాయి. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయచర్యలు అందించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని బట్టి రంగంలోకి దిగాలని సిబ్బందిని ఆదేశించింది.




Also read:JAGAN Mangalagiri: మంగళగిరిలో ప్లాన్ మార్చిన సీఎం జగన్.. నారా లోకేష్ సీటు మార్చుకోవాల్సిందేనా?


Also read:రచ్చ రేపిన సీతారామం-కార్తికేయ 2.. లైగర్ ను దాటేసి మరీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి