Sita Ramam and Karthikeya 2 Crosses Liger Collections on its 4th day: ఆగస్టు నెలలో టాలీవుడ్ ఏకంగా మూడు హిట్ సినిమాలు అందుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమాలతో టాలీవుడ్ హిట్స్ అందుకుని మంచి ఊపు మీద ఉంది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
దీంతో ఆ కొత్త సినిమా కంటే కార్తికేయ సీతారామన్ సినిమాలు ఆదివారం నాడు వసూళ్లు చేయడం ఆసక్తికరంగా మారింది. సీతారామంసినిమా 24వ రోజు అంటే ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో 93 లక్షలు వసూలు చేస్తే, కార్తికేయ 2 సినిమా విడుదలైన 16వ రోజు అంటే ఆదివారం నాడు కోటి 55 లక్షలు వసూలు చేసింది. బింబిసార సినిమా మాత్రం అదే రోజు లైగర్ కంటే తక్కువగానే 31 లక్షలు వసూలు చేసింది. లేగర్ 4వ రోజు కేవలం 58 లక్షలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగలిగింది.
ఇక ప్రస్తుతానికి అన్ని సినిమాల లెక్కలు చూస్తే సీతారామం సినిమా 24 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల పదహారు లక్షల షేర్ వసూలు చేస్తే, కార్తికేయ 2 సినిమా 16 రోజులకు గాను 29 కోట్ల 33 లక్షల షేర్ వసూలు చేసింది. బింబిసార సినిమా 24 రోజులకు గాను 32 కోట్ల 61 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 38 కోట్ల 21 లక్షల రూపాయలు షేర్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా బిజినెస్ 16 కోట్ల 22 లక్షల జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 17 కోట్లని నిర్ణయించారు. ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసిన ఈ సినిమా 21 కోట్ల 21 లక్షల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కార్తికేయ 2 సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 16 రోజులకు గాను 48 కోట్ల 78 లక్షల వసూళ్లు సాధించింది.
నిజానికి ఈ సినిమా బిజినెస్ కేవలం 12 కోట్ల 80 లక్షల రూపాయలకు మాత్రమే జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 13 కోట్ల 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేశారు ఇప్పటికే 35 కోట్ల 48 లక్షల వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక బింబిసార సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 24 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల 25 లక్షల వసూళ్లు సాధించింది. ఈ సినిమా పూర్తిస్థాయి బిజినెస్ 15 కోట్ల 60 లక్షలకు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 16 కోట్ల 20 లక్షలు ఫిక్స్ చేశారు. ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసిన ఈ సినిమా 21 ఒకటి కోట్ల 5 లక్షల వసూళ్లతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read: Liger Movie Day 4 Collections: దారుణంగా పడిపోయిన లైగర్ వసూళ్లు.. హిందీలో కూడా సేం సీన్!
Also Read: Liger Movie Offer: సొంత ఊళ్లో పూరీకి షాక్.. లైగర్ మూవీ టికెట్లపై 3+1 ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి