Three Military Plane Crashes today: భారత వైమానిక దళానికి చెందిన MIG విమానం శనివారం ఉదయం భరత్‌పూర్ జిల్లాలోని ఉచైన్ ప్రాంతంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఇక విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రమాదం సాంకేతిక కారణాల వలన జరిగిందని చెబుతున్నా ప్రస్తుతం వైమానిక దళం ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తోంది. ఇక ప్రమాదంపై సమాచారం అందిందని డిఫెన్స్ పీఆర్వో కల్నల్ అమితాబ్ శర్మ కూడా వెల్లడించారు. ఇక ఏ విమానం కుప్పకూలింది అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఎగురుతున్న యుద్ధ విమానం ఉచైన్ వెలుపల గ్రామంలో పొలాల్లో పడిపోయిందని నాగ్లా బీజా గ్రామస్థులు తెలిపారు.


విమానం కూలిన శబ్ధంతో గ్రామం మొత్తం దద్దరిల్లిందని దీంతో గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అంటున్నారు. ఇక ఊరి బయట ఎక్కడ చూసినా విమాన ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని అంటునారు. విమానం కూలిన శిథిలాలలో పైలట్ లేదా ఇతర గాయపడిన వారు ఎక్కడా కనిపించలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి ముందు పైలెట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడి ఉంటాడని అక్కడి వారు భావిస్తున్నారు.


అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు రక్షణ శాఖ లేదా వైమానిక దళం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని, అయితే ఏ విమానం కూలిపోయిందో ఇంకా తెలియరాలేదని డిఫెన్స్ పీఆర్వో కల్నల్ అమితాబ్ శర్మ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వైమానిక దళం నుండి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే అది ఏ విమానం అనే సమాచారం అనేది నిర్ధారించబడుతుంది.  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో సుఖోయ్‌- 30, మిరాజ్‌ - 2000 విమానాలు శిక్షణ అభ్యాసాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండూ పరస్పరం ఢీకొన్నట్టుగా తెలుస్తోంది.


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఏయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. రోజు వారి ప్రాక్టీస్ లో భాగంగా నింగిలోకి ఈ విమానాలు వెళ్లినట్టు తెలుస్తోంది. రెండు విమానాల్లోని ఫైయిలెట్లకు  తీవ్ర గాయాలు కాగా ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, ఒకరి కోసం గాలింపు చేపట్టారని తెలుస్తోంది.  ప్రమాద స్థలానికి చేరుకున్న ఐఏఎఫ్ రెస్క్యూ బృందం పరిస్థితిని సమీక్షిస్తోంది. ఈ ఘటనపై రక్షణశాఖ విచారణకు ఆదేశించినట్టు చెబుతున్నారు, ఈ ఘటనపై చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడి ఫైయిలెట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. 
Also Read: Trivikram Oscar : ఆస్కార్ వరకు త్రివిక్రమ్ తీసుకెళ్తాడట!.. తమన్ మాటలపై నెటిజన్ల ట్రోలింగ్
Also Read: Taraka Ratna Heart Attack: అత్యంత విషమంగా తారకరత్న పరిస్థితి.. గుండె పని చేయడం లేదట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook