Taraka Ratna Ecmo Treatment నందమూరి తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయన గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని సమాచారం. ఇలా కృత్రిమంగా శ్వాసను అందిస్తూ చికిత్స చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్స్ ఉండటంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారట.
తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు ఆయనకు కుప్పంలోని హాస్పిటల్లోనే చికిత్సను అందించారు. తారకరత్నకు పరిస్థితి ఇలా ఉన్నా కూడా నారా లోకేష్ మాత్రం తన పాదయాత్రను కొనసాగించాడు. యువగళం పాదయాత్రలో ఇలా తారకరత్న కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముందుగా సొమ్మసిల్లి పడిపోయాడని, కేవలం అస్వస్థత వల్లే అలా జరిగిందని సమాచారం వచ్చింది. కానీ తరువాత అది గుండెపోటు అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉందని, నిలకడగా ఉందని చెప్పారు. ఆ తరువాత పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, బెంగళూరుకు తరలిస్తున్నామని అన్నారు. అలా తారకరత్న విషయంలో అభిమానులు అనుక్షణం ఆందోళన చెందుతూనే ఉన్నారు.
అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, క్షేమంగానే ఉన్నాడంటూ తారకరత్న గురించి నిన్న సాయంత్రం బాలయ్య బాబు ప్రకటన ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ సైతం తన అన్న గురించి యోగక్షేమాలు కనుక్కున్నాడని, బాలయ్యకు ఫోన్ చేశాడనే టాక్ వచ్చింది. సాయంత్రం బెంగళూరుకు ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా సమాచారం. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వైద్యుల ప్రకటన వచ్చింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటించారు.
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Taraka ratna Health Update : అత్యంత విషమంగా తారకరత్న పరిస్థితి.. బెంగళూరుకు ఎన్టీఆర్
అత్యంత విషమంగా తారకరత్న
గుండె పని చేయడం లేదన్న డాక్టర్లు
ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా కృత్రిమ శ్వాస
సాయంత్రం బెంగళూరుకు ఎన్టీఆర్