Rajasthan Bsf jawan roasts papad in hot sand: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఎండవేడికి తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇక సమ్మర్ లో బైటకు వెళ్తే.. కూల్ డ్రింగ్స్ తాగుతుండాలని,  కొబ్బరి బొండాలు తాగుతుండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూడాలంటూ చెప్తున్నారు. ఇక ఉద్యోగస్తులు తప్పనిసరి బైటకు వెళితే.. తమతో పాటు గొడుగులు కూడా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్న మనమే ఎండల వల్ల నరకం అనుభవిస్తున్నాం. ఇక బైటమనకోసం విధులు నిర్వర్తించే పోలీసులు, బార్డర్ సెక్యురిటీ పోలీసులు ఇంకా ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పగలనక, రాత్రనక మనకోసం సెక్యురిటీని నిర్వహిస్తుంటారు. సరైన సమయానికి తిండి ఉన్న లేకపోయిన కూడా, దేశం కోసం తమ వారిని వదిలిపెట్టి బార్డర్ లో సెక్యురిటీగా ఉంటారు. ఈ క్రమంలో ఒక బార్డర్ సెక్యురిటీ జవాన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు జవాన్ కు కు సలాం కొడుతున్నారు.



పూర్తి వివరాలు..


కొన్నిరోజులుగా సూర్యుడు నిప్పులు కొలిమిలా మారాడు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు.   ప్రజలు బైటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది వడదెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ లో ఎండలు బీభత్సంగా ఉంటాయని విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బార్డర్ లో సెక్కురిటీ నిర్వహిస్తున్న ఒక జవాన్ ఒక పాపడ్ తీసుకుని వచ్చాడు. ఆయన ఇసుకలో.. పాపడ్ వేశాడు. కొద్ది నిముషాలు మట్టిలో పెట్టాడు. సాధారణంగా మనం పాపడ్ ను నూనెలో వేసి గోలించుకుని తింటాం. ఇది రోటీన్ గా జరిగేదే. కానీ బార్డర్ సెక్యురిటీకి చెందిన జవాన్ మాత్రం.. తాము ఎంత ఎండను భరిస్తామో...చూపించే ప్రయత్నం చేశాడు. ఒక పాపడ్ ను తీసుకొచ్చి ఇసుకలో పెట్టాడు. దాన్ని ఇసుకతో కప్పి ఉంచాడు . కొద్ది నిముషాల పాటు వేచి చూశాడు. మరల మట్టిని పాపడ్ మీద నుంచి పక్కకు జరిపాడు.


Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?


అప్పుడు ఊహించని ఘటన ఎదురైంది. పాపడ్.. ఎండవేడికి సలసల కాగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ రెస్పాండ్ అయ్యారు. మన దేశం కోసం సైనికులు, భరించలేని ఎండలో కూడా విధులు నిర్వహిస్తున్నారని, వారి త్యాగానికి సెల్యూట్ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మనం ఇళ్లలో ఉండి ఏసీలో కూడా ఎండకు తాళలేక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది జవాన్లు మాడు పగలగొడుతున్న ఎండలో దేశం కోసం విధులు నిర్వహిస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. రాజస్థాన్ లోని బికనీర్ లో దేశంలో కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈసారి 47 డిగ్రీల వరకు కూడా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతను నమోదైయ్యాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter