Cm Ashok Gehlot Announces To Ujjwala Lpg Cylinders For  Rs 500: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని బీపీఎల్, ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్లు అందజేస్తామని వెల్లడించారు. సోమవారం అల్వార్‌లోని మలాఖేడాలో జరిగిన బహిరంగ సభలో గెహ్లాట్ ప్రసంగించారు. వచ్చే నెలలో తాము బడ్జెట్‌ను సమర్పిస్తామని.. 12 డొమెస్టిక్ సిలిండర్లు ఇస్తామని అందులో ప్రకటిస్తామన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు పేదలకు గొప్ప ఉపశమనం కలిగించింది. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఉజ్వల యోజన పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ఓ డ్రామా ఆడారని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ రూ.1036కి అందుబాటులో ఉందన్నారు. 


'వచ్చే నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెడతాం. నేను పెద్దగా ప్రకటించదలచుకోలేదు. ఈ రేంజ్‌లో వచ్చే వారిపై అధ్యయనం చేయిస్తున్నాం. కానీ ఏప్రిల్ 1 నుంచి బీపీఎల్, ఉజ్వల పథకాల కింద వచ్చే కుటుంబాలకు ఒక్కో సిలిండర్‌కు రూ.500 చొప్పున అందజేస్తాం..' అని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటన సంచలనంగా మారింది.


మరోవైపు ఆయన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం గ్యాస్ ధరలు పెంచిన మోదీ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధిరావాలని అంటున్నారు. రాజస్థాన్ రాష్ట్ర చరిత్రలో ఇదో సంచలన ప్రకటన అని అంటున్నారు. 


అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ దేశం ‘ప్రేమకు చెందినది, ద్వేషం కాదు’ అని అన్నారు. ద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నామని అన్నారు. తన 'భారత్ జోడో యాత్ర'ని ప్రశ్నించిన బీజేపీ నాయకులకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వాళ్ల మార్కెట్ ద్వేషం అని.. తన దుకాణం ప్రేమ అని అన్నారు. విద్వేషాల బజారులో ప్రేమ దుకాణాలు తెరవడానికి బీజేపీ నేతలు కూడా ముందుకు హితవు పలికారు. మన దేశం ప్రేమతో కూడిన దేశం అని.. ద్వేషం లేని దేశం కాబట్టి చివరికి వారు కూడా అదే చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరంజీవి ఆరోగ్య బీమా పథకం, మహాత్మాగాంధీ ఇంగ్లీషు పాఠశాల పథకాన్ని గాంధీ ముక్తకంఠంతో కొనియాడారు.


 



Also Read: Twitter Poll: లేపి తన్నించుకోవడమంటే ఇదే, ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చిన యూజర్లు


Also Read: Andhra pradesh: ఏపీలో త్వరలో మరిన్ని ఐటీ కంపెనీలు, 184 కోట్లతో అమెజాన్ ఫెసిలిటీ