ఏపీలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. మరో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో త్వరలో అమెజాన్ సంస్థ డెవలప్‌మెంట్, ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దిగ్గజ కంపెనీ పెట్టబడులు పెట్టనుంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలతో ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో అమెజాన్ సంస్త డెవలప్‌మెంట్, ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఆ సంస్థ 184.12 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనికి సంబంధించి అమెజాన్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. 2023 కొత్త సంవత్సరంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనుంది. అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించింది. అమెజన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న డెవలప్‌మెంట్,ఫెసిలిటీ సెంటర్లతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
అమెజాన్ వంటి కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టడం వల్ల త్వరలో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలున్నాయి. 2023 జనవరి నెలలో విశాఖపట్నం కేంద్రంగా ఐటీ సదస్సు, ఫిబ్రవరిలో గ్లోబల్ టెక్నాలజీ సదస్సుల నేపధ్యంలో విశాఖ మరింత ప్రాచుర్యంలో రానుంది.
Also read: Vandebharat Train: విజయవాడకు త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, పరిశీలనలో రెండు రూట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook