రాజస్థాన్ రాజకీయాలు (Rajasthan Crisis) రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్ (Rajasthan CM Ashok Gehlot) వర్సెస్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీ విప్ ధిక్కరించడం, సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలిచి కనీసం షోకాజ్ నోటీసులకు బదులివ్వకపోవడంతో పార్టీ అధిష్టానం 19 మంది ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) ఎంచక్కా అంత్యాక్షరి ఆడుతూ సరదాగా కనిపించారు.  Rajasthan: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో బాలీవుడ్ క్లాసిక్ మూవీ మేఘల్ ఏ అజమ్, ఆమిర్ ఖాన్ ‘లగాన్’ మూవీ పాటలు (Congress MLAs Antakshari) పాడుతూ సరదాగా కనిపించారు. సచిన్ పైలట్ వెంట వెళ్లకుండా.. బీజేపీలోకి జంప్ అవకుండా చూసేందుకు తన వర్గం ఎమ్మెల్యేలను హోటల్‌లో ఉంచగా.. వారు సినిమాలు చూస్తూ, తంబోలా, అంత్యాక్షరితో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Rajasthan కాంగ్రెస్‌‌కు పూర్తి మెజార్టీ ఉంది: రణ్‌దీప్ సుర్జేవాలా


మాకు మెజార్టీ ఉంది.. నో ప్రాబ్లమ్
మెజార్టీ వర్గం తమదేనని, తాము 100 కంటే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా అన్నారు. మాకు మెజార్టీ ఉందని ప్రతిపక్ష నేతలకు తెలుసునని, లేకపోతే బలనిరూపణకు బీజేపీ ఎప్పుడో పట్టుబట్టేదని ఆయన అభిప్రాయపడ్డారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..