Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటోంది. ముందుకుగా పార్టీలో విభేదాలపై దృష్టిసారించింది. సీఎం అశోక్ గెహ్లాట్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మెత్తపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. సచిన్ పైలట్‌తో మాట్లాడిన ఖర్గే.. గతంలో ఏం జరిగిందో మర్చిపోవాలని సూచించారు. క్షమించి ముందుకు సాగాలని చెప్పారు. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ నాయకులు కలిసిగట్టుగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ముందే ప్రకటించబోదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సచిన్ పైలట్ మాట్లాడుతూ.. అశోక్ గెహ్లాట్ తనకంటే పెద్దవారని.. ఆయనకు అనుభవం ఎక్కువ, భారీ బాధ్యతలు ఉన్నాయన్నారు. తాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరినీ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. వ్యక్తి కంటే పార్టీ, ప్రజలే ముఖ్యమన్నారు. తాను కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నానని.. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం దశాబ్దాలుగా కాంగ్రెస్ సంప్రదాయమన్నారు. 


'మల్లిఖార్జున ఖర్గే అనుభవజ్ఞుడైన నాయకుడు. మా పార్టీ అధ్యక్షుడు. ఆయన చెప్పిందే నాకు ముఖ్యం. గతం మర్చిపోమని చెప్పారు. ఆ సమయం తిరిగి రాదన్నారు. ఇప్పుడు మన ముందు కొత్త సవాలు ఉంది. సానుకూల ఆలోచనతో ముందుకు సాగాలి. పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలి. ఆ దిశగా మన శక్తివంచన లేకుండా కృషి చేయాలి..' అని ఖర్గే సూచించారని సచిన్ పైలట్ చెప్పారు. 


రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం తర్వాత సచిన్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని సచిన్ పైలట్ చెప్పారు. సమష్టి నాయకత్వమే ముందున్న మార్గమన్నారు. తాను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఎన్నికల్లో గెలిచే మ్యాజిక్ తన వద్ద ఉందని ఎవరూ చెప్పుకోలేరని ఆయన అప్పట్లో అన్నారు. అదే సమయంలో రాజస్థాన్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు తాము చేయాల్సింది అంతా చేస్తామని.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.


Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  


Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి