Rajasthan Former Minister Rajendra Singh Gudha: రాజస్థాన్‌ మాజీ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా సంచలన ఆరోపణలు చేశారు. తనపై 50 మంది కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. మంత్రివర్గం నుంచి ఆయనను సీఎం అశోక్ గెహ్లాట్ తొలగించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కాంగ్రెస్ మంత్రులు ఆయనను అడ్డుకున్నారు. తనను సభలో మాట్లాడనివ్వలేదని.. కాంగ్రెస్ మంత్రులు తనను సభ నుంచి బయటకు లాగారని రాజేంద్ర సింగ్ గూడా ఆరోపించారు. తనపై 50 మంది దాడి చేసి.. కొట్టారని, కాళ్లతో తన్నారని వాపోయారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ తనను మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీతో టచ్‌లో ఉన్నానంటూ ఆరోపణలు చేశారని.. తన తప్పు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానని అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ శాసనసభ సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి రాజేంద్ర సింగ్ గూడా సభలో గందరగోళం సృష్టించారు. దీంతో సభ సోమవారం కూడా వాయిదా పడింది.  
సభలో స్పీకర్ సీపీ జోషి కుర్చీ వద్దకు చేరుకుని రాజేంద్ర సింగ్ వాగ్వాదానికి దిగారు. 


అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన రాజేంద్ర సింగ్.. తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్ సుఖాడియా కాలం నుంచి పార్టీని చూస్తున్నానని అన్నారు. రాజస్థాన్‌లో అత్యాచారాలు పెరిగిపోయాయని.. తన ఊపిరి ఉన్నంత వరకు అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల కోసం పోరాడుతూనే ఉంటానని స్ఫష్టం చేశారు. 


సైనిక సంక్షేమం (స్వతంత్ర బాధ్యత), హోంగార్డులు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. శాంతిభద్రతలు, మహిళల భద్రతపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు.


Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  


Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి