Rajinikanth: రాజకీయ అరంగ్రేటంపై తలైవా సంచలన నిర్ణయం
సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Rajinikanth sensational decision | చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం మళ్లీ ఆలస్యమైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి పార్టీ పెట్టడం లేదని తలైవా మంగళవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తలైవా (Rajinikanth) ట్విటర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖను విడుదల చేశారు.
‘‘రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఇప్పుడు కాదు. అనారోగ్య కారణాల దృష్ట్యా నూతన పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుంటున్నా’’ అంటూ రజనీకాంత్ లేఖలో పేర్కొన్నారు. అయితే రజనీకాంత్ రాజకీయ ప్రవేశం (Rajini's political Entry) పై దాదాపు 28 ఏళ్ల ఊగిసలాట కొనసాగుతోంది. అప్పటినుంచి కూడా తలైవా ఏదోఒకరోజు పార్టీ పెట్టడం ఖాయమంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రకటనతో రజనీ (Tamil Nadu) అభిమానులు నిరాశలో మునిగిపోయారు. Also Read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
అన్నత్తే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రజనీకాంత్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ (Hyderabad) లోని అపోలో ఆసుపత్రిలో ఐదు రోజుల కింద చేరారు. ఆతర్వాత డిశ్చార్జ్ అయిన అనంతరం శనివారం చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనను విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంటున్నారు. Also Read: Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook