సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాట రాజకీయ ఆరంగేట్రం చేస్తారని ఆయన ఫ్యాన్స్ తోపాటు తమిళ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా పార్టీ ప్రారంభించే పనులను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు సినిమా వెనుక సినిమా చేస్తూ .. షూటింగ్ లతో బిజీబిజీగా గడిపిన తలైవా . .  ప్రస్తుతం పార్టీ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకోసం ఆయన మరోసారి తన అభిమానులతో సమావేశం అవుతున్నారు. గతంలోనే రజినీ మక్కల్ మండ్రుం పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఈ అభిమాన సంస్థ కింద ఆయన తన ఫ్యాన్స్ తో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రజినీ మక్కల్ మండ్రుం అంటే పీపుల్స్ ఫోరమ్ అని అర్థం. చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యాన్స్ తో సమావేశమయ్యారు. ఇందులో 38 జిల్లాలకు చెందిన రజినీ మక్కల్ మండ్రుం సెక్రటరీలు పాల్గొన్నారు. పార్టీ ఎలా ఉండాలి.. ? పొలిటికల్ పార్టీ పేరు ఎలా ఉంటే బాగుంటుంది..? పార్టీ పేరుపై సూచనలు.. ఇలా పలు రకాలుగా ఫ్యాన్స్ తో ఆయన చర్చిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏప్రిల్ నాటికి పార్టీ పేరును ప్రకటించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.   
[[{"fid":"182796","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]  


Read Also: ఆలోపే రజినీకాంత్ చచ్చిపోతాడు..!!
చాలా కాలంగా ఎదురు చూస్తున్నప్పటికీ  తలైవా పొలిటికల్ ఎంట్రీ ఆలస్యమైంది. 2017లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు రజినీకాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి రాజకీయ అంశాలపై తరచుగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఢిల్లీ అల్లర్ల విషయంలో కేంద్రం తీరును తప్పుపట్టారు. దీంతో  ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలకు తెరపడింది. బీజేపీలో చేరడం కంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: మిస్టర్ అండ్ మిస్ ట్రెయిలర్ విడుదల  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..