Rajiv Gandhi Assassination case: నిందితులకు క్షమాభిక్ష పరిస్థితి ఏంటి..గవర్నర్‌కు ఆ అధికారం లేదా..
Rajiv Gandhi Assassination case: దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల వ్యవహారం మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ కు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Rajiv Gandhi Assassination case: దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల వ్యవహారం మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ కు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
రాజీవ్ గాంధీ హత్యకేసు ( Rajiv gandhi Assassination case ) లో వేలూరు జైళ్లో ఏడుగురు నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో ఒకరైన పేరరివాళన్ ( Perarivalan ) తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. 2018 సెప్టెంబర్ 9న తమిళనాడు ప్రభుత్వం ( Tamilnadu Government ) ఏడుగురు ఖైదీల విడుదలకు సిఫారసు చేస్తే గవర్నర్‌కు తీర్మానం పంపించదని..3-4 రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకూడదా అని జస్టిస్ నాగేశ్వరరావు ప్రశ్నించడంతో..ఆ అవసరం లేదని తుషార్ మెహతా సమాధానమిచ్చారు. 3-4 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాటల్ని రికార్డు చేస్తున్నామని..చెబుతూ విచారణను రెండు వారాలకు సుప్రీంకోర్టు ( Supreme Court ) వాయిదా వేసింది.
మరోవైపు ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ( Union Ministry ) అఫిడవిట్ దాఖలు చేసింది. పేరరివాళన్ క్షమాభిక్ష ( Pardon Petition ) అంశానికి సంబంధించిన అన్ని పత్రాల్ని గవర్నర్ పరిశీలించారని..అయితే ఈ విషయంలో రాష్ట్రపతికి మాత్రమే పూర్తి అధికారముందని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. చట్ట ప్రకారం ఆయన అంటే రాష్ట్రపతి ( President ) నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల కోసం ప్రభుత్వం సహా పలు రాజకీయ పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ ( Governor )కు ఆ అధికారం లేదని తెలియడంతో మళ్లీ రాజ్ భవన్‌కు చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook