Rajnath Singh: చైనా సరిహద్దులో ఆర్మీకి పూర్తి స్వేఛ్చ
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు.
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు. ( Fathers day: నాకు నాన్నే స్ఫూర్తి... వైఎస్ జగన్ ట్వీట్ వైరల్ )
ఆర్మీకిచ్చిన ఆ స్వేచ్ఛ ఏంటి…
సరిహద్దుపై చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపధ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్... సీడీఎస్ ఛీప్, త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సీడీఎస్ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎంఎం నర్వాణే, నావికాదళ అధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్, ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చైనా ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా... ఏ విధమైన దాడులకు ఉపక్రమించినా సరే.. దీటైన సమాధానం చెప్పేందుకు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో సరిహద్దులు కలిగి ఉన్న దాదాపు 3 వేల 5 వందల కిలోమీటర్ల మేర సరిహద్దుపై భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది. ( సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఖరారు )
ఇండో చైనా సరిహద్దు వద్ద ( Indo China border ) ఇకపై భారతదేశం పూర్తి భిన్నమైన వ్యూహాత్మక విధానాన్ని అవలంభించనుందని తెలుస్తోంది. భూతలం, గగనతలంతో పాటు సముద్రమార్గంపై చైనా కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచుతూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాజ్‌నాధ్ సింగ్ ఆదేశించారు. ఇందులో భాగంగానే చైనా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా దీటైన సమాధానమిచ్చేందుకు ఆర్మీకి పూర్తి అధికారాల్ని ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఆర్మీ, వాయుసేనలు సరిహద్దుపై తమ సామర్ధ్యాన్ని పెంచనున్నట్టు తెలుస్తోంది. ( Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ, ఎలా.. ఫొటో గ్యాలరీ )
తూర్పు లడ్డాఖ్‌లోని గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనలో 76 మందికి తీవ్రగాయాలయ్యాయి. రెండు దేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖ ( Line of Actual control ) ( LAC)పై జరిగిన హింసాత్మక ఘర్షణలో చైనీయులు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు.