సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఖరారు..

KCR To Meet Santosh Babu Family | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను అధికారులు ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.

Last Updated : Jun 20, 2020, 05:48 PM IST
సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఖరారు..

KCR To Visit Suryapet | తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు(KCR) సూర్యాపేట పర్యటన ఖరారైంది. సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. చైనాతో ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu) కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తెలంగాణ సర్కార్ ప్రకటించిన రూ.5కోట్ల చెక్కును సంతోష్ బాబు కుటుంబానికి అందజేస్తారు. చెక్కుతో పాటు ఇంటి కోసం భూమిపట్టాను కూడా అదే సమయంలో అందజేయడంతో పాటు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు సమాచారం. Colonel Santosh Babu ఫ్యామిలీకి భారీ సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

సీఎం శుక్రవారం నాడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల నగదు(RS 5 Crore to Santosh Babu Family)తో పాటు, ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తానని ప్రకటించడం తెలిసిందే. సంతోష్ బాబు కుటుంబంతో పాటు గాల్వన్ లోయ(Galwan Valley)లో సరిహద్దుల్లో చైనాతో పోరాడుతూ అమరులైన మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు సైతం తెలంగాణ సర్కార్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర మంత్రి ద్వారా ఆ సాయాన్ని అమరుల కుటుంబాలకు అందజేయనున్నట్లు సైతం కేసీఆర్ తెలిపారు.  సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు.. వీరుడికి వీడ్కోలు

తానే స్వయంగా వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి, చెక్కుకును అందజేస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు అంతా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News