Rafale fighter jets భారత్‌లో ల్యాండ్ అవడంతోనే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శత్రు దేశాల పేరెత్తకుండానే పరోక్షంగా పాకిస్తాన్, చైనా దేశాలకు ( India warns China, pakistan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పడుతుందా అంటే అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లోకి చొచ్చుకు రావాలనే కాంక్షతో రగిలిపోతోంది పాకిస్తాన్, చైనా దేశాలే కావడంతో ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. Also read: #Watch Rafale fighter jetsకి అంబాలాలో ఘన స్వాగతం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాఫెల్ ఫైటర్స్ జెట్స్ కొనుగోలుపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి (Rajnath Singh slams congress) సైతం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా బదులిచ్చారు. రఫెల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ నుంచి వాటిని కొనుగోలు చేయడం జరిగిందని.. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read: Rafale Facts: రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు