కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ సర్కార్ కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో అణ్వస్త్ర ప్రయోగంపై భారత రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్రాలు మొదట ప్రయోగించరాదనేది భారత దేశ విధానమని చెప్పిన రాజ్ నాథ్...భవిష్యత్తులో ఏం జరుగుతందనేది పరిస్థితులపై ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. అణు ప్రయోగంపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంశంమారింది.


పాకిస్తాన్ హద్దు మీరితే అవసరమైతే అణ్వస్త్ర ప్రయోగానికి వెనుకాడబోమనే రాజ్ నాథ్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వెళ్లిన రాజ్‌నాథ్‌..అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ వాజ్‌పేయీకి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్ నాథ్ అణు ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు